వరంగల్ పట్టణంలోని గిర్మాజీపేటలో వెలసిన దుర్గేశ్వరాలం కాకతీయ ప్రోలరాజుచే నిర్మింపబడింది.ఇతని కాలము క్రీ.శ.1115-1158.సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న హనుమకొండనుండి మార్చి ఓరుగల్లులో నూతన రాజధానిని నిర్మించడానికి ముందుగా,తన కోట రక్షణార్థమై ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు.'దుర్గ ' రక్షకుడైన ఈశ్వరుడు అయినందువలన ఈ స్వామివారు దుర్గేశ్వరునిగా పిలుబడుతున్నారు.శివలింగం గోధుమ వర్ణంలో పార్థప్రహారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వెలసిన వీరభద్రస్వామి వీరశైవులందరికీ ఆరాధ్యదైవం.వారి ఇళ్ళలో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా వీరభద్రపళ్ళెరం వేస్తారు.అందులో భాగంగా స్వామిని స్తుతిస్తూ,లయబద్ధంగా వారు వేసే 'ఖడ్గాలు ' చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది.ఇటువంటి ప్రత్యేకత మరెక్కడా మనకు కనిపించదు."శరభ ' అంటూ వారు లయబద్ధంగా చేసే విన్యాసాలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతాయి.ఈ ఆలయంలోని అమ్మవారు పరమ శాంతస్వరూపిణి. కోరికలు తీర్చే కల్పవల్లి.అందుకే అమ్మకు 'ఒడిబియ్యం ' పోసి మహిళలు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు.
ఇక్కడ ప్రతియేటా మహాశివరాత్రి సందర్భంగా త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
No comments:
Post a Comment