OUR TEMPLES - మన దేవాలయాలు
మన దేవాలయాలు తరతరాల చరిత్రకు,విశ్వాసాలకు సజీవ దృశ్యరూపాలు. మన చారిత్రక,సాంస్కృతిక వారసత్వాన్ని రేపటి తరాలకు అందించే వారధులు. శివ,విష్ణు,శక్తి,గణపతి,కుమారస్వామి తదితర ఆలయాల్లో వైదిక(స్మార్త),శైవ,వైఖానస,పాంచరాత్ర,శాక్త వంటి పలు ఆగమవిధానాల ప్రకారం పూజాధికాలు జరుగుతుంటాయి. నిత్యోత్సవ,పక్షోత్సవ,మాసోత్సవ సంవత్సరోత్సవాల్లో ఆలయాల శోభ ద్విగుణీకృతమౌతుంది. ప్రతి ఆలయానికీ ఒక విశిష్టత ఉంటుంది. అది ఆ ఆలయ స్థలపురాణం రూపంలో పొందుపరచబడి ఉంటుంది. అటువంటి విశేషాలను అందించే ప్రయత్నం చేస్తాను.
Tuesday, 13 September 2011
Inavolu Mallanna Jathara (Festival) Slideshow Slideshow
Inavolu Mallanna Jathara (Festival) Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Inavolu Mallanna Jathara (Festival) Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
Friday, 9 September 2011
శ్రీ దుర్గేశ్వరస్వామి దేవాలయం - గిర్మాజీపేట - వరంగల్ పట్టణం
వరంగల్ పట్టణంలోని గిర్మాజీపేటలో వెలసిన దుర్గేశ్వరాలం కాకతీయ ప్రోలరాజుచే నిర్మింపబడింది.ఇతని కాలము క్రీ.శ.1115-1158.సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న హనుమకొండనుండి మార్చి ఓరుగల్లులో నూతన రాజధానిని నిర్మించడానికి ముందుగా,తన కోట రక్షణార్థమై ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు.'దుర్గ ' రక్షకుడైన ఈశ్వరుడు అయినందువలన ఈ స్వామివారు దుర్గేశ్వరునిగా పిలుబడుతున్నారు.శివలింగం గోధుమ వర్ణంలో పార్థప్రహారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వెలసిన వీరభద్రస్వామి వీరశైవులందరికీ ఆరాధ్యదైవం.వారి ఇళ్ళలో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా వీరభద్రపళ్ళెరం వేస్తారు.అందులో భాగంగా స్వామిని స్తుతిస్తూ,లయబద్ధంగా వారు వేసే 'ఖడ్గాలు ' చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది.ఇటువంటి ప్రత్యేకత మరెక్కడా మనకు కనిపించదు."శరభ ' అంటూ వారు లయబద్ధంగా చేసే విన్యాసాలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతాయి.ఈ ఆలయంలోని అమ్మవారు పరమ శాంతస్వరూపిణి. కోరికలు తీర్చే కల్పవల్లి.అందుకే అమ్మకు 'ఒడిబియ్యం ' పోసి మహిళలు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు.
ఇక్కడ ప్రతియేటా మహాశివరాత్రి సందర్భంగా త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
Subscribe to:
Comments (Atom)